1.అథ వింశాధ్యాయప్రారంభః
జనకమహారాజు మరల ఇట్లడిగెను.
మునీంద్రా! సర్వపాపములను నశింపజేయునదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక
మహాత్మ్యమును మరియు వినవలెనను కోరిక కలదు గాన చెప్పుము. వశిష్టముని
పల్కెను. రాజా! వినుము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని,
అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమయినది దానిని
నీకు చెప్పెదను. అత్రిమహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా!
లోకత్రయోపకారము కొరకు కార్తిక మహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పుదను వినుము.
అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మ
శ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తికమాస ధర్మమును వినగోరితిని
గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునీంద్రా! బాగు బాగు.
నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము జేసితివి.
చెప్పెదను వినుము. కార్తికమాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన
శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమయిన దేవుడు
లేడు. కార్తికమాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును
బొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ,
లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుదురు. ఈవిషయమును గురించి
పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు, సూర్యవంశసంభూతుడు
పురంజయుడను ఒకరాజు గలడు. ఆపురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు
ప్రవర్తించి తరుాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్ట పరాక్రమయుక్తుడై
మహాశూరుడై సత్యమును, శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి
బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించువారితో
స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెను. రాజు యీప్రకారముగా అధర్మ పరాయణుడు
కాగా అతని సామంత రాజులు, కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి
గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి
అయోధ్యాపట్టణము చుట్టును చెరకు పానకమునకు తేనెటీగలవలె శిబిరాలతో
చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి
బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయం
ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్త్రాస్త్ర పూరితమును,
మహాచక్రయుతమును, మంచి గుర్రములతో గూడినదియునైన సూర్యదత్త రథమునెక్కి గజ,
రథ, తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారమునుండి శత్రు సైన్యములో
ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను
ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే వింశాధ్యాయస్సమాప్తః
అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల,
సూక్షమములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీవిషయము పూర్వమందు
కైలాసపర్తమున పార్వతికి శంకరుడుజెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను
జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెడను
వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ
బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి
నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా!
మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక
అహంబ్రహ్మేతి(నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను.
ఈవాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా
చెప్పగోరెదను.ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య
రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్నము నీవెందుకు
తెలుసుకొనుట లేదు. సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన
వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈదేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను
గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది
ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది.
గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని
తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు.
దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో
అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని=ఆత్మయని తెలిసికొనుమని
భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని
పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది
ఏది కలదో అది నేను=ఆబ్రహ్మనని తెలిసికొనుము. ఎవనియొక్క
సాన్నిధ్యమాత్రముచేత జడముైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని
ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము.
ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క
ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని
తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో
అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని
తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది
భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు
బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును
అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును
౧. పుట్టుటా=జనిమత్వ, ౨. ఉండుట=అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ=పెరుగుట, ౪.
పరిణామత్వ=పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ యారు వికారములు
లేనివాడు. వికారములు ఈఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థముు
ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను
తచ్ఛబ్దార్థమునుజ్ దెలిసికొనవలయును. శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ
సాక్షాద్విధిముఖేనచ! వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!
తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము.
వ్యావృత్తియనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది
బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము.
సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ
సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసారలక్షణ
విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగాదనియు, తమస్సుకు పైదనియు
అనుపమానందరూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు
చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను
తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్ధము. వేదములచేత ఎవ్వడు
సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో
వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత
సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే
బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.
వేదములందు ఎవ్వనికి "తదనుప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత
ప్రాణులందు ప్రవేశమున్ను, ఆజీవులను గురించి నియంతృత్వమున్ను
జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి
కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని
తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి.
తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము
చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం
పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ.
పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున
గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి
నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనా
తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు
వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి
లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము
సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను.
ఈలక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చటభాగలక్షణను గ్రహించవలెను. అనగా
కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్త్వమసియందు
సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే
గ్రహించినయెడల అభేదము సంభవించును. తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా
నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును యిట్లే
బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ
విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన
దేవదత్తుడొక్కడే భాసింును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల
జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ
బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను
ఆచరించవలెను. ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ
స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ
అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది
నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను జేయవలెను.
ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి
విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి
విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః
వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును
జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా
తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును.
కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో
వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును.
కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము
దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము.
కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా
చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు.
కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు
వైకుంఠపతియగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు
వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన
వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తికమాసమందు
పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె
నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు.
స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము
పెట్టవలెను.శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట
పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ
గలదు. చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి
గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత
పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును
బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను
సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను.
మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు
వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము.
ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము
హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు
దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు.
వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి. ఓరాజా!
ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క
మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు
శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి
దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట
అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు
పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను.
అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది
అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ
దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ
బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను,
ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు
గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను
జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము
చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు
కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ
కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి
అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు
చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును
ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ
ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ
సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే
యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును
బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక
ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత
చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల
మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని.
ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా
నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి
మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన
నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన
సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి
గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను.
మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము
యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ
మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ
పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే
ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు
దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత
మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి
యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును?
దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు
గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు.
వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని
నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః
ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము.
విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు హరిముందర
నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరనివాసి యగును. ద్వాదశినాడు హరికి
దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల
పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు
నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క
అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి
సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును.
కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర
నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన
పుణ్యమునకు అంతములేదు. ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని
గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను,
ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ
ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను
వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు
విష్ణులోకమునకు జేరి సుఖించును. కార్తీకమాసము నెల రోజులు దీపమును
బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు
రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము
దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన
ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును.
కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి
వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు
కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు
సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన
విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ
సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా
తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును
ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను
దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను.
యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక
ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల
సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో
గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న
నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో
జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును
వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ
ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని
యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే
మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని
విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు
వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె.
పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము
ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము
సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు
నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు
ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను
దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో
సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను.
ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు.
బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు.
స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక
బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును
దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు.
స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు
సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని
ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని
తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును
బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి
అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి
ఆద్రవ్మును భూమియందు దాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత
నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి
దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన
ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక
ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి
శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని
ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ
నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి
ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన
అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు
భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః
కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి
జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము
సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా
వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును.
రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు
నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము
తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ
రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును.
కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి
సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము
పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట
మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు
వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక
మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము
చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో
గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి
ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము
నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు
ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు
సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము
గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున
పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము
అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును
భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును
సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను.
కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును,
అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును
భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును,
ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక
ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును
జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము
చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని
దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను.
చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది
నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము.
సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని
పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా
అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు
౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము,
౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర
నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము. ఈమాసమందు శరీర
సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో
స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు
నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది
మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని,
కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన
సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును,
మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో
లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము
ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై
పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన
హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన
వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి
పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను,
ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను
పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి
తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪.
లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ
స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం
సమర్పయామి ౯. కపాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి.
౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩.
లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ
ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా
షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో
పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు శ్లో!!
పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః! అర్ఘ్యం గృహాణ
దైత్యారేదత్తంచేదముమాపతే!! అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు
భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది
దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను.
ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి
సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును
బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను
సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస
నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము
లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల
పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు
ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు
ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు
ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను
వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును.
పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు
ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః
రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో
హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును.
కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై
వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి
సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో
దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును
పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు. ఈవిషయమై యొక
పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును.
బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగదేశమందు మందరుడను
నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై
ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల
భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో
శ్రేష్ఠురాలైయుండెను. ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు
ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక
కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని
యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను.
అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని
ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు
మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని
మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన
కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను.
తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని
కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర
ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి,
కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన
బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి
భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా!
ఆబ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన
సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓరాజా! ఇట్లుండగా
దైవవశముచేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై
హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద
భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా
యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము
దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును
చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు
శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము.
ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను,
ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము.
శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని
సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో
ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు
వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను.
ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా
సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి
మనశ్శుద్ధి కొరకై పురాణపఠనమారంభించెను. ఆమెయు ప్రతియింటికిబోయి
పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా
ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను.
కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను.
అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును,
పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను,
ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను
అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి
ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది
వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు
నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది
విష్ణుదూతలతోనిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి.
ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు
జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము
జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల
వీడు నరకమందున్నాడు. ఈరెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు
బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి
ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక
ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను
యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను.
ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి
పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ
చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు.
ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను.
నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత
వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా!
కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము.
దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన
వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు
ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన
పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా
పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని
ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత
వారు నరకమునుంి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు
మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు
పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును. ఈచరిత్రను వినువారు
మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేికొని మోక్షమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః
జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు
పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని
యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి?
వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా
యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును,
దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు
పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము
వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని
కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను
అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను.
అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక
హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని
కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు
మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వ జన్మమున
సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు
స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా
కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతో గూడి నానాలంకార
శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను.
ఆయూరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియగు భార్యగలదు.
ఆబ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నముకొరకై పట్టణములు, గ్రామములు పల్లెలు
తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన
ధ్యాన్యాదికమును శిరస్సుననుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ!
నాకుఆకలి కలుగుచున్నది. త్వరగా వంటచేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి
శాంతించెదను. భర్త యిట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటను లెక్కచేయక
పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి
దండముతో భార్యనుగొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ
గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు
భార్యసంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి
భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికిపోయెను.
సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆమాటవిని వాడు
నీవు బ్రాహ్మణ స్త్రీవి. అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు
గొప్పకులమునందు బుట్టినవారు. మేము నిందుతులము. కాబట్టి యిట్టి సంపర్కము
మీకు తగునా? ఈప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను
కొట్టెను. ఆమెయు వానిని కొట్టి వానిని విడిచ రాజమార్గమున బోవుచుండగా
పైనజెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆస్త్రీ వానిని పట్టుకుని రతికేళికి
రమ్మనమని పిలుచుకొనిపోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపము
చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమునుబొంది భర్తవద్దకు బోయి ఆయనను బ్రతిమాలి
ఆయనతో గూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు
మృతినొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి
భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి
కార్తీకపున్నమినాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ
గలిగినది. ఆ హేతువులచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను. ఆ
బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనే యాతనలనొంది తిరిగి
భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె
పుట్టిన సమయము మంచిదాయని యొక బ్రాహ్మణునియడిగెను. అతడు ఈమె తండ్రిగండాన
పుట్టినదని చెప్పెను. ఆమాటవిని చండాలుడు ఆశిశువును దీసుకొనిపోయి
అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును
దీసికొనిపోయి తన ఇంటిలో దాసీగానున్నయొక స్త్రీకి నప్పగించెను. ఆదాసీది
ఈమెను పెంచెనది. తరువాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథ
పూర్వోక్తమే. రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ
వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామకీర్తనము
చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త
ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తనము
చేయదో, మనస్సు హరి పాదపద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని
పాపములు యెట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు
ముక్తినొందెదరు. ఇందుకు సందియములేదు. కార్తీకధర్మమునకు పాపములను నశింపజేయి
సామర్ధ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరమునొందును.
ఇది నిశ్చయము. పాపములను నశింపజేయి ఈకథను విన్నవారు సమస్త పాపములను
నశింపజేసి మోక్షమొందుదురు. ఈకథను వినిపించువారు పాపవిముక్తులై వైకుంఠమందు
విష్ణువుతో గూడి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః


ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టమోధ్యాయస్సమాప్తః
వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను
సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు
గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము
చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి
భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు
తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు
సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి
చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు.
కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు
సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క
కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర
సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె
ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును
గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని,
మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను
హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు.
హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు
బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము
చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ
శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు
నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల
పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు
రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి
ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క
గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు
నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను,
ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి
క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది.
శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు
మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి
మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు
సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో
సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును.
హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన
పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత
సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని
పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు
భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు.
సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు.
సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి
తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః
వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు
హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు
పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున
హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు
దీపదానము జేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని
చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో
గాని పాత్రను జేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి
వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో
పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి
పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ
క్రింది మంత్రమును జెప్పుచు ఆదీపమును దానము జేయవలెను. శ్లో!!
సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం! దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు
సదా మమ!! దీపము సర్వజ్ఞానదాయకము. సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు
దీపదానమును జేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ
ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందాచరించిన యెడల
అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును
ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానమువలన
మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక జేసిన పాపములు నశించును.
ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము. పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత
బంధువిహీనయైనయొక స్త్రీ గలదు. ఆస్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది.
ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము
ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను
చేసెడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో
ధనవంతురాలైనది. ఆస్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను
వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక
వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు
పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన
శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో
ఈచిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియె. ఛీ
మూఢురాలా ఇప్పుడు నామాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈదేహము
సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము
నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది.
దేహము నశించగా పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును.
ఈదేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును
నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును
విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా
కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని
విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము
చేయుము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము
చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లుచేసిన యెడల అనేక జన్మముల
పాపములు నశించును. సందేహమువలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా
వెళ్ళెను. తరువాత ఆమాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు
వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ,
దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి
బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత
ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు
పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి
శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె
దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను
నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈరహస్యమును నీకు
జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము
బొందుదురు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే వింశాధ్యాయస్సమాప్తః
2.అథ ఏకోనవింశాధ్యాయ ప్రారంభః
జ్ఞాన సిద్ధుడిట్లు
స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు
ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను,
అద్వితీయునిగాను, దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను
రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము.
వాక్యములతో జెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు
కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రందున్న
శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచరప్రాణులచే స్తుతింపబడినవాడవు.
పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవిభూతి విస్తారమే.
శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే
యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా
నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె
తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు
ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్నరూపుడవు
నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద
స్వరూపమును జూచిన తరువాత ఈజగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద
సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే
ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే
లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు.
అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యముగాని నీవు మాంసమయములైన
నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ కృష్ణా! నీకు నమస్కారము. ఓయీశ్వరా! నీకు
నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శనఫలము
విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ నమస్కారము. ఓదేవేశా! నన్ను
నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు
నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ
జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను
సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న
నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము.
త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా,
పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు.
గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద
సుధాబ్ధిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు
హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు
నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు నమస్కారము.
వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు
నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత
సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు. అనేక బోధలచేతను,
తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను
మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి నీరూపమును జూచి
దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ
విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును
కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ
సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా,
విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా,
నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు
వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న
జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా!
నీస్తోత్రమునకు సంతోషించితిని. నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది.
వరమిచ్చెదను. కోరుకొనుము. అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను.
గోవిందా నాయందు దయయున్నయెడల నీస్థానమును యిమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర
వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను. ఓజ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును.
కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు.
బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి
ఉపాయమును జెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నేజెప్పెడి
మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితో గూడ
సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను.
కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక
వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు
నిద్రాసుఖప్రదమైన ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ
మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును
తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై
ఈచాతుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్యఫలమును బొందును. నాకు
నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని,
లాభాలాభములు గాని లేవు. అనగా యీనిద్రాదులకు భయపడి నేను సముద్రందు
శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి
చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననసరించి
నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు. నాకు
ఇష్టులగుదురు. నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠింు
వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు
చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట
కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను. ఓయీ!
నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని
వ్రతములలోను ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు
గాని, ఎవరైనను హరిపరాయణులై ఈనాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును
జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు,
యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను.
ఈచాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక
సన్యాసిని గాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుంిన
యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము
చేసికొని చాతుర్మాస్యమునందు హరిని బూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య
వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందెడి గతిని
బొందును. సందేహము లేదు. పరమాత్మతుష్టిై చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు
గోహత్య చేసిన వానిఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసికొని
ఏవిధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు
విష్ణులోకమును జేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాలను విని
చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః
ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా! నేననుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క
అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓమునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే
సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న
నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరయిరి. పాపవంతుడైన నేనెక్కడ. ఇట్టి సద్గతి
యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైన కార్తీకమాసమెక్కడ?
ఈమునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక
ఇట్లు ఫలించునుగదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు
లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా
కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు,
చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు
వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధముచేత నాపాప పర్వతములు
కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము
కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదవినుము.
అనిత్యమైన ఈదేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని
తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు. అవి దేహాది
ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయవలెను. దానితో
చిత్తశుద్ధిగలిగి తద్ద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధముగా
తెలిసికొనవలెను. దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది
సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ
ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో
విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు
భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము
వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి
యందుకార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను.
ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు బోవును
మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది ;పుణ్యకాలములందును,
చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే
స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము
౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు
రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి
పుణ్యకాలము కార్తికమాసము ఈకార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును.
ఈకార్తికముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన
శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన
కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు.
నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు.
కార్తికమాసముతో సమానమయిన మాసము లేదు. కర్మ స్వరూపమును దెలిసికొని
కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును.
ఉద్భూతపురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు.
అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆవ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి?
దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ
విషయమంతయి సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు
ఈమనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి.
సమాధానమును జెప్పెదను. సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా
ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి
కార్తికశుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు
చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా
హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై
నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక యిది
పుణ్యకాలము.ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును.
ఈనాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును
జెప్పెదను వినుము. ఈవిషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది. పూర్వము
కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర
కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి
ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును
గూర్చివచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి
పద్మపురేకుల వంటి నేత్రములఓ ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి
అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు
నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను. ఓ నారదా! నీవు సంచరించు
స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు
లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్ములందున్నారా? ఈవిషయమంతయు ఈసభలో
జెప్పుము. నారదుడు ఆమాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె. ఓ
స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన
కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ
కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు
దెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను
విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకార వర్జితులుగా
నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా
నున్నారు. కాబట్టి ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను
రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి
లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి
వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి
సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును,
తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త
భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి
కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు
నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి.
కొందరు కామాంధులై యుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు
ఏకవ్రతపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా
నుండిరి. కొందరు ఏకాదశ్యు[అవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని
వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి.
కొందరాత్మచింతజేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి
మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని
బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె
గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి
ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు
వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన
కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య
ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట
ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతింతుడును, మనోవాచామగోచరుడును,
దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన
విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో
హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారిముందర
నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః
3.అథ అష్టదశాధ్యాయ ప్రారంభః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః
4.అథ సప్తదశాధ్యాయప్రారంభః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః
5.అథ షోడశోధ్యాయ ప్రారంభః
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః
6.అథ పంచదశాధ్యాయ ప్రారంభః
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః
7.అథ చతుర్దశాధ్యాయ ప్రారంభః
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః
8.అథ ఏకాదశాధ్యాయ ప్రారంభః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః
9.అథ దశమోధ్యాయః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః
10.అథ నవమోధ్యాయ ప్రారంభః

విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయముల్లన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు ఇట్లు పల్కిరి. ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను జేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు యెంతమాత్రమును బెట్టకతానే అంతయు భుజించువాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజింిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని, మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను జేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు. ఈఅజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును. ఈప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూఢులు, ధర్ మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును జే్యువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్స్నానమాచరించు వారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు. మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి. తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతినిగా ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీకరించితినిగదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా అయ్యో యెంత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను. ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును> నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులనుజంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణనామమెక్కడ? అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.
11.అథ అష్టమాధ్యాయ ప్రారంభః

వశిష్ట మునీంద్రా! నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆసందేహమును తెలిపెదను. దానిని నశింపజేయుము, మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి. పాతకములలో గొప్పవానిని జెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిషుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది యెట్లు సంభవమగును? ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి ఈపాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీకదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును. వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపలనుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియనివానివలె ఉండి పుడిసెడు నీళ్ళు అనగా చేతికివచ్చినన్నిజలము జ్స్వయముగా పడికొట్టుకొనిపోవుచు గడ్డిపరకను ఆధారముగా చేసికొనిన దరికిజేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములనుబట్టి చూడగా అధికములయిన పాపములను జేసి స్వల్పపుణ్యముచేతవాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకేాదు వినువారికందరికిని ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖమాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధికపాతకములను నశింపజేయునని మీరు చెప్పిారు. అది యెట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యముచేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓరాజా! వినుము. మంచి విమర్శచేసితివి. నేనుగూడ విచారించితిని. వేద శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్షములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంతపనినైన చేయసమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము గూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధికఫలప్రదమగును. కనుక ఈవిషయమందు సందేహము పొందకుము. చెప్పెదను సావధానముఆ వినుము. ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈమూడుగుణములును ప్రకృతివలన గలిగినవి. ప్రకృతియనగా మాయ. అందులో సత్వగుణమువలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నియు తమస్సువలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు జెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినొందును. దేశమనగా పుణ్యక్షేత్రము. కాలమనగా పుణ్యకాలము. పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈమూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను, మంత్రరహితముగాను, చేయి దానాదికము తామసమనబడును. ఇది ఎంతగొప్పదయినను సర్వపాపనాశన సామర్థ్యము గలది గాదు. ఓ జనకమహారాజా! దేశకాల పాత్రములను విచారించి క్చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదని భావము. అట్లు దేశకాలవిచారణ చేసిన ధర్మమువలన సుఖమును బొందుదురు. కాబట్టి జ్ఞానముచేతగాని, అజ్ఞానముచేతగాని దేశకాలపాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయఫలము ఇచ్చును. ఇందుకు సందియములేదు. పర్వతముయెత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచినయెడల ఆకట్టెలన్నియు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన యెడల ఆ మురికిపోవును. అట్లే అల్ప పుణ్యముచేత అధికపాపములు నశించగలవు. అజ్ఞానముచేతగాని, జ్ఞానముచేతగాని చేసిన పాపములు అధిములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనమువలన నశించును. మహిమ తెలియక చేయబడినదయినను హరినామ సంకీర్తనముచే పాపములన్నియు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమునందు కన్యా కుబ్జమను క్షేత్రమందు వేదవేదాంగపారంగతుడైన సత్వనిష్ఠుడను నొక బ్రాహ్మణుడుగలడు. ఆబ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరికాలమున అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తిగలవాడై యుండెను. అట్టివాడు స్వల్పపుణ్యముచేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిళునకు యౌవనము రాగానే దుష్ట బ్రాహ్మణుని యింటిలో ఒక దాసీయున్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలగాడై ఆదాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరు అతనిని గృహమునుండి వెళ్ళగొట్టిరి. అజామిళుడు ఆయూరిలోనేయొక చండాలుని యింటిలో నివాసము చేసికొని నిత్యము దాసీతోగూడి కుక్కలను వుచ్చులువేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను జంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆదాసీ కల్లుద్రాగుదమను యాశతో తాటి చెట్టెక్కి కొమ్మవిరిగి క్రిందబడి మృతిబొందెను. తరువాత అజామిళుడు భార్యను జూచి తన ప్రాణములకంటె అధికప్రియమైనది. గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి యింటికిబోయెను. తరువాత అజామిళుడు యౌవనవంతురాలయిన దాని కూతును చూచి పాపాత్ముడు గనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరుపుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిళుడు నడుచునప్పుడును, కూర్చుండునప్పుడును, జలపానకాలమందును, భోజనముచేయునప్పుడును, తిరిగుచున్నప్పుడును పుత్రపాశముచేత బద్ధుడై నిరంతరము ఆనామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపించగా అతనిని క్తీసుకొనిపోవుటకు గాను ఎర్రనిగడ్డములు, మీసములు గలిగి చేతులందు దండములను రాళ్ళను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను దీసుకొని పోవవచ్చిన యమదూతలను జూచి భయపడి పుత్రస్నేహముచేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ, నారాయణాయని పిలిచెను. ఆపులుచునప్పుడు భయముచేత దీనస్వరముతో పెద్దగా ఓనారాయణాయని పలుమారులు పిలిచెను. రాజా! దైన్యముతోగూడి నారాయణ నామసంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రా వెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను జూచి ఓయీ! ఈ అజామిళుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా! ఆవిష్ణుదూతలు పద్మములవలె విశాలములయిన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాలంకృతులును, కిరీటవంతులును, కుండలధారులును, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, నాలుగు చేతులు గలవారును, సుందరదేహులును, శంఖచక్రములను ధరించినవారును, తమకాంతిచేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయిఉండిరి. ఇట్టి విష్ణుదూతలను జూచి యమదూతలు ఇట్లనిరి. మీరుఎవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? అని యడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పకవిమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవుకోర్కెగలవారై ఇట్లు పలికిరి.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టమోధ్యాయస్సమాప్తః
12.అథ సప్తమాధ్యాయః
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః
13.అథ షష్ఠాధ్యాయ ప్రారంభః
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః
14.అథ పంచమాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు తిరిగి ఇట్లు
చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు
పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాము నశించుటయేగాక పుణ్యమధికమగును.
కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము
కుబుసమువలెపాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి
నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల
వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును. భగవద్గీతయందు విభూతి విశ్వరూప
సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు
అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన
వారును, విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు
శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో
జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు,
చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు
సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు
వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక)
వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది
బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము
చేసినయెడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా
నుండును. కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును.
కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి
విముక్తుడాయెను. ఆకథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా
చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు
గలడు. ఆదేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును
జూచి తండ్రి నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను.
కార్తీకమాసమందు ప్రాతస్స్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో
దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు
కార్తీకమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆమాట విని
తండ్రి ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో
ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప
పడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను.
ఆతండ్రి ఇట్లనెను. కుమారకా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో
అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి
ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొర్రలో
నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత
ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ
వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో
దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి
బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను.
అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి
అయ్యా ఏమిటి ఈపనివల్ల ఏమిఫలము అనియడిగెను. కిరాతా! వినుము చెప్పెదను.
నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము ఈధర్మము మనుష్యులకు కీర్తి
పెంపొందించును. కార్తీకమాసమందు మోహముచేతనైనను స్నానదానాదికమును జేసినవాడు
పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై
స్నానదానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల
కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని
అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి
ఆశ్చర్యమునొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను
విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను. కిరాతుడును
మూషకదేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను
విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను.
విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక
ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది.
ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు
బుద్ధినుంచుము. అట్లయిన యెడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో
పనిలేదు. నిశ్చయము.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః

శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము. ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే.


మానవ జన్మలో అట్లా మనస్సుని సంస్కరించుకొనే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మనల్ని మార్చటానికి అద్భుతమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులో మనం బాగుపడటానికి వీలుగా ఉపదేశాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఎప్పుడూ చుట్టు ఉంటాడు, కానీ భగవత్ రూపాన్ని చూసే యోగ్యత లేదు, గుర్తించగలిగే యోగ్యత లేదు. విశ్వసించే యోగ్యత లేదు. నేను దేవుణ్ణిరా! ఇదిగో నా విరాట్ రూపం అని చూపిస్తే, చూసిన అర్జునుడికే నమ్మకం కలగలేదు, యుద్ధం అంతా పూర్తి అయ్యాక రథాన్ని డేరా వద్దకు తెచ్చి, నేను విజయం సాధించాను, నీవు సారథివి వచ్చి తలుపుతీయాలని తెలియదా అని అడిగాడు కృష్ణుడిని. అంటే నేరుగా కృష్ణుడినుండే విన్నా, విశ్వాసం కలగలేదు. అందుకే భగవంతుడు నేను దేవుణ్ణి అని అనుకొనేట్టు రాడు, ఉపదేశాత్మకుడై ఎప్పుడూ ఉంటాడు. అందుకే భగవంతుణ్ణి శబ్దాత్మకుడు అని అంటాం. ఆయన విగ్రహ రూపాంలో ఉంటాడా, లేదా కదులుతూ ఉంటాడా అనేది ప్రశ్నే కాదు, ఆయన శబ్దాత్మకుడై ఎప్పడికీ మన మధ్య ఉంటాడు, ఆ శబ్దమే భగవద్గీత.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః
15.అథ చతుర్థధ్యాయ- కార్తీక పురాణం

అథ చతుర్థధ్యాయ ప్రారంభః జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక రాజుగలడు. సంతానము లేక గోదావరీతీరమందు తపస్సు చేసెను. గోదావరీ స్నానార్థమై పైప్పమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆమాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పల్కెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్రసంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగ ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను జేసెను. పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రునిగనెను. ఆరాజు విని అధికానందమును బొంది కార్తీకమహాత్మ్యము సత్యమైనది ఈకార్తీకవ్రతము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీకమాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు "శత్రుజిత్" అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చినవారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడైయుండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయొక్క నడుమువంటి నడుుగది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిరుదులును, కుచములును గలదియు, అరటి స్థంభములవంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై యుండెను. ఆరాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ భ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారునియొద్దకుబోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈప్రకారముగా అనేకదినములు జరిగినవి. ఆసంగతి బ్రాహ్మణుడు తెలుసుొి నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తీకపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి క్తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దదు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణినరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆజీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆదినము కార్తీకపూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందుముగ్గురికి శివుని సన్నిధియందు మరణము గల్గినది. అంతలో పాశ హస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానముమీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈనాభార్య జారిణి. ఈరాజకుమారుడును జారుడుగదా. నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి అని యడిగెను. శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పదము వినుము. ఈనీభార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి కామమోహముచేత కార్తీకపూర్ణిమా సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను చించి వత్తిని చేసి ఇచ్చినది.గాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈరాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనయినా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీభార్యకు రాజకుమారునకు ైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగా లేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి. శివదూతలు ఈప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈబ్రాహ్మణుని భార్యతో రమించి ఈబ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈబ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతినొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి. కాబట్టి కార్తీకమాసమున ధర్మమును జేయవలెను. అట్లు చేయనివాడు రౌరవనరకమును బొందును. కార్తీకమాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమునందుగాని దీపమాలను సమర్పించిన యెడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్ద్వారా పునరావృత్తిరితమగు మోక్షమునొందును. సందేహములేదు. కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుుగాని తన శక్తికొలది దీపార్పణము చేసినయెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీకమాసమున దీపముల పంక్తి సమర్పించుము. ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ స్సమాప్తః
16.అథద్వితీయాధ్యాయ ప్రారంభః
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము. ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే.
17.దేవాలయంలో నైవేద్యం:

చాలామంది ఒక స్వీట్ పాకెట్ తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి ఇవ్వండి అని దేవాలయంలోని అర్చుకునికి ఇస్తారు. స్వీట్ స్టాల్స్ లోవో మన ఇంట్లో చేసినవో స్వీట్స్ నైవేద్యంగా ఇవ్వకూడదు. దేవాలయానికి దేవునికి పండ్లు మాత్రమే తీసుకు వెళ్ళాలి. అలాకాదు మేము ఫలానా నైవేద్యం పెట్టించ దలచుకున్నాం అనుకున్న వారు ముందురోజే అర్చకునికి సంబరాలు ఇచ్చి నైవేద్యం పెట్టించుకోవాలి. నైవేద్యం పెట్టిన తరువాత మీరు రెండు ఉంచుకొని ఇవ్వండి మేమే పంచుతాం ప్రసాదం అంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే ఈశ్వర శక్తిని అర్చకునిలోనికి ఆరోపణ చేస్తారు. అర్చకుడు గుడిలో ఉన్న దేవతలో ఎనిమిదో వంతు అని చెప్తారు. చరమూర్తి క్రింద లెక్క. దేవాలయాన్ని ఎనిమిది పెట్టిభాగిస్తారు. శిఖరం, ప్రాకారం, లోపలి గోడ, ముఖ మంటపం, అర్థ మంటపం, మహామంటపం, ధృవమూర్తి, విమానంలో ఉన్నటువంటి మూర్తి, ఇలా ఎనిమిది క్రింద విడగొట్టి ఈ ఎనిమిదిమందిలో ఎనిమిదో వంతు శక్తి అర్చకునికి ఉంటుంది. అందుకని దేవాలయంలో ప్రసాదాన్ని అర్చకుడు ఇవ్వాలి. అంతేకానీ వేరెవరూ ఇవ్వకూడదు. పోలీసు, ఎమ్ ఆర్ ఓ ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే..రేషన్ కార్డు కావాలంటే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే కదండీ అంటే పోలీసు ఇస్తారా??
18.తల్లిదండ్రుల గొప్పదనం
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.
19.సంస్కారం - భగవద్గీత

సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత మానవజన్మకి ఉంది. మనిషి ఇది లేదు అది లేదు అని ఈనాడు ఇన్ని ఏడుపులు వస్తున్నాయి అంటే మనస్సుకి నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇతరులని అణిచివేసి బ్రతుకుతున్నాడు అంటే, మనస్సుకి కలిగిన ఉద్రేకాల వల్ల కదా! కేవలం బాహ్యమైన లోపాల వల్ల ఏడుపు కలగడం లేదు, అవి మనస్సులో ఏర్పడ్డ లోపం వల్ల. దీనికి కారణం సంస్కారం అని సహవాసం అని రెండు ఉన్నాయి. ఇందులో సంస్కారం చాలా బలమైనది. సహవాసం కొంత తోడ్పడగలదు, కొంత మార్పు తేగలదు. కానీ సంస్కారం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సులభంగా అర్థం చేసుకోవడానికి చిన్ని ఉదాహరణ తీసుకుందాం. మిరప గింజ రుచి ఏమిటి ? కారం. పంచదార రుచి ఏమి ? తీపి. ఒక మిరపగింజను పంచదారలో వేశారనుకోండి, దానికి తీయటి సహవాసం దొరికింది, కానీ మిరప గింజ యొక్క కారం పోతుందా. సహవాసం ఎంతటిదైనా సంస్కారం బలీయమైనది. అట్లాకాక మిరపకాయను పంచదార పాకంలో ఉడికించినా, దాని ప్రభావం అది చూపించి తీరుతుంది. మిరపగింజయే కాదు చింత పులుపు అయినా, వేప చేదు అయినా తీసుకోండి, సంస్కార ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఇది మనిషి కంటే ఇతరమైన ప్రాణుల్లో. కానీ మానవ శరీరం చాల గొప్పది. సహవాసం, సంస్కారం రెంటినీ బాగు చేసుకోవడానికి యోగ్యమైన ప్రాణి మానవుడంటే. మిగతా ప్రాణులకి ఎంత చేసినా వాటి ప్రవృత్తి పోదు. కానీ మనిషికి సహవాసం మంచిదైతే సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత ఉంది, కనుకనే మన పెద్దలు సత్సంఘం, సజ్జన సహవాసం చేయండి అని పదే పదే చెబుతుంటారు. సహవాసం వల్ల బయట కొంత మార్పు కనిపిస్తుంది, ఆ సహవాసం కొంతకాలం సాగితే లోన సంస్కారం కూడా మారుతుంది. అట్లాంటి అవకాశం ఉంది. ఏ రావణాసురుడి లాంటి వాడిని వదిలేయండి. సీతమ్మ వాడి వద్ద తొమ్మిదినెలలు ఉండి బాగుచేద్దాం అని ప్రయత్నం చేసినా, "సీతే! యేషమే సహజో దోషః", నాకు ఇలా వంకరగా ఉండటం సహజం, "స్వభావో దురతిక్రమః" పుట్టుకతో వచ్చిన స్వభావం కట్టెలతో తప్ప పోదు, పోగొట్టుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసాడు. అట్లాంటి వాడిని వదిలి పెట్టేద్దాం. కానీ సామాన్య మానవుడికి తన సంస్కారాన్ని మార్చుకొనే యోగ్యత ఉంది. రెంటి వల్ల మారే అవకాశం ఉంది. ఒకటి శాస్త్రీయమైన ఆచరణ వల్ల, రెండవది భగవంతుని అనుగ్రహ విశేషం చేత.
మానవ జన్మలో అట్లా మనస్సుని సంస్కరించుకొనే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మనల్ని మార్చటానికి అద్భుతమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులో మనం బాగుపడటానికి వీలుగా ఉపదేశాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఎప్పుడూ చుట్టు ఉంటాడు, కానీ భగవత్ రూపాన్ని చూసే యోగ్యత లేదు, గుర్తించగలిగే యోగ్యత లేదు. విశ్వసించే యోగ్యత లేదు. నేను దేవుణ్ణిరా! ఇదిగో నా విరాట్ రూపం అని చూపిస్తే, చూసిన అర్జునుడికే నమ్మకం కలగలేదు, యుద్ధం అంతా పూర్తి అయ్యాక రథాన్ని డేరా వద్దకు తెచ్చి, నేను విజయం సాధించాను, నీవు సారథివి వచ్చి తలుపుతీయాలని తెలియదా అని అడిగాడు కృష్ణుడిని. అంటే నేరుగా కృష్ణుడినుండే విన్నా, విశ్వాసం కలగలేదు. అందుకే భగవంతుడు నేను దేవుణ్ణి అని అనుకొనేట్టు రాడు, ఉపదేశాత్మకుడై ఎప్పుడూ ఉంటాడు. అందుకే భగవంతుణ్ణి శబ్దాత్మకుడు అని అంటాం. ఆయన విగ్రహ రూపాంలో ఉంటాడా, లేదా కదులుతూ ఉంటాడా అనేది ప్రశ్నే కాదు, ఆయన శబ్దాత్మకుడై ఎప్పడికీ మన మధ్య ఉంటాడు, ఆ శబ్దమే భగవద్గీత.
20.సదాచారమ్
నిండా నూరేళ్ళు
బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల
మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ
పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు.
"ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు.
ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు
చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏర్పడదు. చతుర్విధ
పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం
కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో
జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు చూచుకొనాలి. ఇది ఐహిక
భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే వేదాంతులకైనా
తప్పదు. అందుకే "సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్" అని అగ్నివేశముని
అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు. "బలవర్ధకాహారాలు,
కావలసినన్ని మందులతో శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!" అని ప్రశ్నింపవచ్చు.
అలా కాపాడుకొనే దేహం ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు.
అలా జన్మ సార్థకత సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో
నడచిన శరీరం మాత్రమే పురుషార్థ సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు.
సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ శాస్త్రం "ఆచారా ల్లభతే
హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం
త్యలక్షణం|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం
లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని
చెప్తోంది. అది నిజం. సదాచార పరుడు అకాల మృత్యువు వాత పడడు. "అకాల రతి
క్రియల వల్ల దుర్జనులు పుడతా"రని శాస్త్రం చెప్పింది. ఆ విషయం "సంధ్యా
సమయంలో సంభోగం చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు
రాక్షసులయ్యా"రని పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి
తప్పక సత్సంతానమే కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి
సదాచార లోపమే మూలం. "ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు
లేక సంపద నిలచి ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ
మూడాచారం దు:ఖ హేతువు. సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే
ప్రసాదిస్తాయి. అందుకే "సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః |
సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ |" అని ప్రాణులకు సుఖ
సంపాదకములుగానే మన మత ధర్మాలు ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న,
పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక డాక్టరు గారు
స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం
తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం
కాలా. కొన్నాళ్ళకు బొట్టు లేకుండా కనబడి "క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు
తగ్గిందండి" అంది. డాక్టరుగారు "ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా?
అనడిగితే లేదంది. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం మారకపోయినా జబ్బు
తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో మార్పు
అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం
చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా.
అలాకాని దశలో అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు
ఆచారమే నిల్పి ధర్మాన్ని రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని
వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది.
No comments:
Post a Comment